
మెదక్ జిల్లా 161వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. పెండ్లి బృందం బస్సును.. కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30మందికి గాయాలయ్యాయి. ఇద్దరికి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. బాధితులను.. నాగల్ గిద్ద కేశ్వర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. హైదరాబాద్ లో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా తెల్లవారుజామున ప్రమాదం జరిగిందంటున్నారు ప్రత్యక్ష సాక్షులు.