మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట్ మండలం మూరహర్ పల్లి రాజీవ్ రహదారిపై 2024 మార్చి 15 శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్ పైన మొక్కలకు నీరు పడుతున్నా వాటర్ ట్యాంకర్ ను ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో ట్యాంకర్ డివైడర్ పైకి ఎక్కగా.. బస్సు ముందు భాగం నుజ్జునుజయి.. రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదల్లోకి దూసుకొని వెళ్లింది. దుబ్బాక నుంచి సికింద్రాబాద్ వెళ్తుతుండగా ఈ ఘటన జరిగింది.
ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయాలయిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం జరగడంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. దీంతో అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.