ఘోరప్రమాదం తప్పింది: వెనకటైర్స్ ఊడిపోయి పక్కకు ఒరిగిన ఆర్టీసీ బస్సు

వరంగల్ జిల్లాలో ఆర్టీసీ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది. రన్నింగ్ లో ఉన్న బస్సు వెనక టైర్లు ఊడిపోయవడంతో బస్సు ఓ పక్కకు ఒరిగి కొంత దూరం వెళ్లింది. ఎదురుగా ఏమీ రాకపోవడం, స్పీడ్ తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో  ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.   

హుజూరాబాద్నుంచి హనుమకొండ వెళ్తుండగా పల్లెవెలుగు ఆర్టీసీ వెనక టైర్లు ఊడిపోయి పొలాల్లో పడిపోయాయి.ప్రమాద సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులు ఉన్నారు. 55 మంది ప్రయాణించాల్సిన బస్సులో 80 మంది ప్రయాణిస్తున్నారు.

ఎల్కతుర్తి శివార్లలో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. బస్సు వెనక టైర్లు రెండూ ఊడిపోయి పొల్లాలో పడిపోయాయి.. అప్రమత్తమైన బస్సు డ్రైవర్ బస్సును నెమ్మదిగా రోడ్డు పక్కన ఆపారు. బస్సు ఓ పక్కకు ఒరగడంతో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడటంతో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి.