
- క్షేమంగా బయటపడిన 35 మంది ప్రయాణికులు
- వరంగల్ జిల్లాలో ఘటన
పర్వతగిరి, వెలుగు : టిప్పర్ ను తప్పించబోయిన ఆర్టీసీ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లగా పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. స్థానికులు, ప్రయాణికులు తెలిపిన ప్రకారం.. హన్మకొండ డిపోకు చెందిన ఆర్టీసీ హైర్ బస్సు సోమవారం ఉప్పరపెల్లి-– అన్నారం రూట్లో వరంగల్‌కు బయలు దేరింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సీత్యాతండా శివారులో సీత్యా తండా శివారు మూలమలుపు వద్దకు రాగానే మట్టి లోడ్‌తో వెళ్తూ టిప్పర్డ్రైవర్ఫోన్మాట్లాడుకుంటూ స్పీడ్‌గా బస్సుకు ఎదురుగా వచ్చాడు. దీంతో బస్సు డ్రైవర్షరీఫ్ అప్రమత్తమై చాకచక్యంగా టిప్పర్‌ను తప్పించడంతో బస్సు పొలాల్లోకి దూసుకెళ్లి పెద్ద బండరాయిని ఢీకొట్టి ఆగింది.
దీంతో బస్సులోని సుమారు 35 మంది ప్రయాణికులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. తమ ప్రాణాలను కాపాడిన డ్రైవర్షరీఫ్ను ప్రయాణికులు అభినందించారు. స్పీడ్ గా వచ్చిన టిప్పర్డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరారు. ఘటనపై పర్వతగిరి ఎస్ఐ ప్రవీణ్‌ను వివరణ కోరగా ఎంక్వైయిరీ చేస్తున్నామని తెలిపారు.