
ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆదోని మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక గంగావతి నుంచి ఆదోని మీదుగా రాయచూరు వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు జాలిమంచి గ్రామం దగ్గర ఓవర్ టేక్ చేసే సమయంలో ముందు వెళ్తున్న రెండు బైక్ లను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనాలపై ఉన్న నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా..మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు . కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల్ని కుప్పగల్ గ్రామానికి చెందిన దంపతులు ఈరన్న ,ఆదిలక్ష్మి మాన్వీ కి చెందిన దేవరాజు , నాగరత్నమ్మగా గుర్తించారు పోలీసులు.
ALSO READ | బనకచర్ల వివాదం..శ్రీశైలంలోని నిల్వ నీళ్లన్నీ తెలంగాణకే ఉండాలి