కరీంనగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంకరపట్నం మండలం తాడికల్ దగ్గర వరంగల్ డీపో 1కు చెందిన ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి తీవ్ర గాయాలైయ్యాయి.

వీరిలో ముగ్గురి పరిస్థతి విషమంగా ఉంది. గాయపడిన వారిని హుజరాబాద్, కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.