సిగ్నల్ వద్ద స్కూటీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

సిగ్నల్ వద్ద స్కూటీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

ఏపీ అనంతపురంలో స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. క్లాక్ టవర్ దగ్గర కల్యాణదుర్గం డిపోకు చెందిన బస్సు... సిగ్నల్ పడగానే ముందుకు కదిలింది. అయితే సైడ్ నుంచి స్కూటీ ఒక్కసారిగా బస్సు ముందుకు రావటంతో... అది చూసుకొని డ్రైవర్ బస్సును ముందుకు పోనిచ్చాడు. దీంతో స్కూటీపైకి ఎక్కింది బస్సు. ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా... స్థానిక ఆస్పత్రికి తరలించారు.