జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని కీర్తి ఫంక్షన్ హాల్ దగ్గర అంబులెన్స్ను పల్లె వెలుగు బస్సు ఢీకొంది. పల్లె వెలుగు బస్సు వేగంగా అంబులెన్స్ ను ఓవర్టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. అంబులెన్స్ డ్రైవర్ కు గాయాలు అయ్యాయి. స్థానికులు డ్రైవర్ ని హాస్పిటల్ కు తరలించారు.
బస్సు నడిపిన డ్రైవర్ ఘటన అనంతరం పరారు అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.