బస్సు నడుపుతుండగా డ్రైవర్కు గుండెపోటు..

గుండెపోట్లు కలవర పెడుతున్నాయి. ఈ మధ్యన రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. రెండు రోజుల క్రితమే ఖమ్మం జిల్లా  సత్తుపల్లిలో ఓ ఆర్టీసీ డ్రైవర్ బస్సు నడుపుతుండగా గుండెపోటుతో చనిపోయాడు. లేటెస్ట్ గా ఇవాళ నల్గొండ జిల్లాలో అలాంటిదే మరో ఘటన జరిగింది. బస్సు నడుపుతుండగానే డ్రైవర్ కు   గుండె పోటు వచ్చింది.దేవరకొండ బస్ డిపో కు చెందిన ఎక్స్ ప్రెస్ బస్సులో ఈ ఘటన జరిగింది. 

నల్లగొండ జిల్లా మల్లెపల్లి నుండి హైద్రాబాద్ కు వెళ్తుండగా ఇబ్రహీంపట్నం దాటగానే   బస్సు డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది.  ప్రయాణ సమయంలో బస్సులో  20 మంది ఉన్నారు. ప్రయాణికులు సేఫ్ గా కాపాడేందుకు డ్రైవర్ తీవ్రంగా ప్రయత్నించి..  బస్సు రోడ్డు పక్కన ఆపి స్టీరింగ్ పై పడిపోయాడు.  బస్సులో ఉన్న ప్రయాణికులంతా సేఫ్ గా ఉన్నారు. వెంటనే కండక్టర్,  ప్రయాణికులు   డ్రైవర్ ఉడావత్ శంకర్ నాయక్ ను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.