జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. బుధవారం(సెప్టెంబర్ 20) ఉదయం మెట్ పల్లి నుంచి ఖానాపూర్ కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు టైర్ పేలి రోడ్డు కిందకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు స్పల్ప గాయాలయ్యాయి. సుమారు 25 మంది ప్రయాణికులతో బయల్దేరిన బస్సు మల్లాపూర్ మండలం మొగిలిపేట ఓబులాపూరం గ్రామాల మధ్య ఉన్న వంతెన వద్ద ప్రమాదవశాత్తు టైరు పేలి, రోడ్డు కిందికి దూసుకెళ్లింది.
అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణనష్టం లేకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.