కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని టెక్రియాల్ శివారులో హైవేపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. నిజామాబాద్ –1 డిపోకు చెందిన రాజధాని బస్సు బుధవారం 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ బయలుదేరింది.
టైర్ పంక్చర్ కావడంతో టెక్రియాల్ శివారులో హైవేపై లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ప్రమాదంలో బస్సు ముందు భాగం ధ్వంసమైంది. డ్రైవర్ నాగనాథ్తోటు, మరో ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కు తరలించారు. ఘటనా స్థలాన్ని దేవునిపల్లి పోలీసులు, ఆర్టీసీ ఆఫీసర్లు పరిశీలించారు.