చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..20 మందికి గాయాలు

హనుమకొండ: హైవేపై  ఆగివున్న వాహనాన్ని తప్పించబోయి ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొట్టిన ఘటన హనుమకొండ జిల్లా హసన్ పర్తి వద్ద జరిగింది. ఈ ఘటన లో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. 

వరంగల్ నుంచి కరీంనగర్ కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు జాతీయ రహదారి పై ఆగివున్న మరో వాహనాన్ని తప్పించబోయి తాటి చెట్టును ఢీకొంది. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలోని ఎల్లమ్మ ఆలయ సమీపంలో ఆదివారం (జనవరి 7) రాత్రి ఈ ఘటన చోటు చేసుకంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసుల.. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను హనుమకొండ ఆస్పత్రికి తరలించారు.