జయశంకర్ భూపాలపల్లి : భూపాలపల్లి – పరకాల ప్రధాన రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వచ్చిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ టిప్పర్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో బస్సు, టిప్పర్ డ్రైవర్లతో పాటు క్లీనర్, బస్సులో ఉ న్న 20 మంది ప్రయాణికులకు తీవ్రంగా గాయపడ్డారు. వారందరినీ అంబులెన్స్ ద్వారా దగ్గరలోని హాస్పిటల్కు తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రాంగ్ రూట్లో రావడంతో ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొన్నాడని అంటున్నారు. ఈ ఘటనలో టిప్పర్ వెనుక వస్తున్న ఓ కారు కూడా ధ్వంసమైంది. అందులో ప్రయాణిస్తున్న నలుగురు వెంటనే కారు నుంచి దిగిపోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.