సంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు ఢీకొని క్రీడాకారుడు మృతి

సంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు ఢీకొని క్రీడాకారుడు మృతి
  • సంగారెడ్డి జిల్లా అన్నాసాగర్ వద్ద ఘటన

జోగిపేట, వెలుగు: ఆర్టీసీ బస్సు ఢీకొని క్రీడాకారుడు మృతిచెందగా, మరొకరికి గాయాలైన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. అందోల్​మండలం గూడెం గ్రామానికి చెందిన జిల్లాస్థాయి కబడ్డీ క్రీడాకారుడు మద్దూరి అనిల్​(25), కుమ్మరి అనిల్ కు బైక్ పై బుధవారం మధ్యాహ్నం అదే మండలంలోని కిచ్చన్నపల్లి గ్రామానికి వెళ్తున్నారు.

 అన్నాసాగర్​వద్ద జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న నారాయణ్​ఖేడ్​డిపో ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీకొట్టింది. దీంతో మద్దూరి అనిల్ స్పాట్ లో చనిపోగా కుమ్మరి అనిల్ గాయపడ్డాడు. మృతుడికి గతేడాది పెండ్లి అయింది.  బాధిత కుటుంబాల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పాండు తెలిపారు.