
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఫ్లై ఓవర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి ఒకరికి కాలు విరిగింది. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే కండక్టర్ లేకపోవడంతో డ్రైవర్ టికెట్లు ఇవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు.
రాయచూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సులో కండక్టర్ లేడు. డ్రైవరు ఒక చేతితో డ్రైవింగ్ చేస్తూ మరో చేతితో టికెట్లు ఇస్తున్నాడు. శంషాబాద్ ఫ్లై ఓవర్ పై రాగానే బస్సు అదుపు తప్పడంతో ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టింది. దీంతో బస్సులో ఉన్న పలువురికి గాయాలయ్యాయి. బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడ్డ వారిలో మహిళలు చిన్నారులు ఉన్నారు వీరందరిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ బస్సులో కండక్టర్ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఫ్లై ఓవర్ సేఫ్టీ వాల్ లేకపోయి ఉంటే ఫ్లై ఓవర్ పై నుంచి బస్సు కింద పడి ఉంటే పెను ప్రమాదం జరిగేదంటున్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.