ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న రూ. 25 లక్షల నగదు సీజ్

ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న రూ. 25 లక్షల నగదు సీజ్

ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో తెలంగాణలో భారీగా నగదు పట్టుబడుతుంది. తాజాగా మెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సులో భారీగా నగదు పట్టుబడింది. మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 

ఈ తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో రూ. 25 లక్షల నగదును పోలీసులు గుర్తించారు. ఈ డబ్బుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు.