ఆర్టీసీ బస్సు ఢీకొని ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ మృతి

చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఓ ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ మృతి చెందాడు. బైక్పై డ్యూటీకి వెళ్తుండగా ఆలిండ్ ఫ్యాక్టరీ వద్ద వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొనడంతో స్పాట్లోనే ప్రాణాలు వదిలాడు. మృతున్ని 2014 బ్యాచ్కు చెందిన ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ ముఫిద్గా గుర్తించారు. అతను సైబరాబాద్ సీపీ ఆఫీసులో అసిస్టెంట్ ఎనలటికల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. అధిక వేగం, నిర్లక్ష్యంగా బస్సు నడిపి ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.