యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తొర్రూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు మండల పరిధిలోని కంచనపల్లి బొడ్డుగూడెం సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తా పడింది.
ALSO READ : ముంబై లోకల్ ట్రైన్ లో ఐటమ్ సాంగ్ తో రెచ్చిపోయిన యువతి
ఈ ప్రమాదంలో బీబీనగర్ మండలానికి చెందిన కొండ రాములు(51), చుక్క యాకమ్మ(56) అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంతమంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 33 మంది ప్రయాణిస్తున్నారు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.