డివైడర్ పైకి ఎక్కిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు

సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ములుగు రాజీవ్ రహదారిపై డీసీఎం వాహనాన్ని ఆర్టీసీ బస్సు వెనక నుంచి అతివేగంగా ఢీకొంది. అంతటితో ఆగకుండా బస్సు డివైడర్ పైకి ఎక్కింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. 

ALSO READ:సమ్మర్ స్పెషల్ రైళ్లు ఆగస్టు వరకు పొడిగింపు