నిజామాబాద్ జిల్లాలో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు

నిజామాబాద్ క్రైమ్, వెలుగు : నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ బైపాస్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పింది. బైకును తప్పించబోయి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. శుక్రవారం కంటేశ్వర్ బైపాస్ వద్ద జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. బోధన్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బైకును తప్పించే ప్రయత్నంలో రోడ్డు పక్కకు దూసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు.