అచ్యుతాపురం సమీపంలో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు

అశ్వారావుపేట, వెలుగు : ఆర్టీసీ బస్సు డ్రైవర్​ సమయస్ఫూర్తితో తృటిలో ప్రమాదం తప్పింది.  ప్రయాణికులు తెలిపిన ప్రకారం 42 మంది ప్యాసింజర్స్​తో  సత్తుపల్లి నుంచి అశ్వారావుపేటకు ఆర్టీసీ బస్సు బయలుదేరింది. అచ్యుతాపురం సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయింది.  

ప్రయాణికులు ప్రాణ భయంతో  వెంటనే కిటికీల నుంచి బయటకు దూకారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. డ్రైవర్ చాకచక్యంగా రోడ్డు పక్కకు బస్సును దింపకపోతే లారీ ఢీకొని పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని ప్రయాణికులు చెబుతున్నారు.