ఘోర ప్రమాదం.. లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం, మీనవోలులో ఏపీఎస్ఆర్టీసీ తిరువూరు డిపోకు చెందిన బస్సు కంచికచర్ల నుండి తిరువూరు వెళ్లే క్రమంలో మేనవోలు వద్దకు రాగానే యాక్సిడెంట్ కు గురైంది. ఎదురుగా వస్తున్న గేదెలను తప్పించబోయి బస్సు లారీని ఢీ కొట్టడంది. ఈ యాక్సిడెంట్ లో బస్సు డ్రైవర్ కాలు బస్సులోనే ఇరుక్కపోయింది.

 బస్సులోని పది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఘటనను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహాయంతో డ్రైవర్ ను బయటికి తీసి రక్షించారు.10 మంది ప్రయాణికులకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం మధిర  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.