ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. పొదల్లోకి దూసుకెళ్లింది

ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. పొదల్లోకి దూసుకెళ్లింది

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. తంగళపల్లి మండలం పద్మ నగర్ గ్రామ శివారులోని పెట్రోల్ పంపు వద్ద ఒక్కసారిగా బస్సు కుడి వైపుకు రోడ్డు దిగి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.  

ఉదయం 5.30 గంటలకు 35 మంది ప్రయాణికులతో సిద్దిపేట నుండి వేములవాడకు బయలుదేరింది బస్సు. డ్రైవర్ నిర్లక్ష్యం,  అజాగ్రత్త వల్లే బస్సు ప్రమాదానికి గురైందని ప్రయాణికులు వెల్లడించారు.  స్పీడ్ బ్రేకర్స్ వచ్చిన బస్ కు బ్రేక్ వేయలేదని అదే స్పీడ్ లో బస్ నడిపాడాని దీంతో బస్సు ప్రమాదానికి  గురైందని తెలిపారు.