ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం .. ప్రయాణికులు సేఫ్

జగిత్యాల జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది.  దీంతో ప్రయాణికులు సేఫ్ గా బయటపడ్డారు.  జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రము నుండి సూరంపేట వెళ్లే దారిలో దమ్మయ్యపేట  వాగులో బస్సు ఇరుక్కుంది.  గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు వాగు ఉప్పోంగిపోతుంది. 

అయితే బస్సు డ్రైవర్ ఇది గమనించకపోవడంతో వాగులో బస్సు దిగబడిపోయింది.  దీంతో ఆందోళన చెందిన ప్రయాణికులు బస్సులో నుంచి దిగి వాగును దాటారు.  బస్సు డ్రైవర్ అప్రమత్తం వలన పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి.  

అయితే ఎన్నో రోజుల నుండి బ్రిడ్జి కట్టించమని ఎన్నోసార్లు  మొరపెట్టుకున్న స్థానిక నాయకులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు అంటున్నారు.  వర్షం కురిసిన ప్రతిసారి తండాలకి రాకపోకలు బంద్ అవుతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికైనా నాయకులు కల్లు తెరవాలని కోరుతున్నారు.