పరిగిలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు

పరిగిలో ఆర్టీసీ బస్సు బోల్తా..  30 మందికి గాయాలు
  • ఒకరి పరిస్థితి విషమం.. ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
  •  ప్రమాద సమయంలో బస్సులో  100 మందికి పైగా ప్రయాణికులు

పరిగి, వెలుగు: ప్రయాణికులకు టికెట్లు కొట్టేందుకు ఆర్టీసీ బస్సును రోడ్డు పక్కకు తీసి ఆపే క్రమంలో బోల్తా పడింది. 30 మందికి గాయాలయ్యాయి. ఒకరికి సీరియస్​గా ఉంది. శుక్రవారం రాత్రి టీఎస్34టీఏ6868 నంబర్​ఆర్టీసీ బస్సు పరిగి బస్టాండ్​నుంచి షాద్​నగర్​బయలుదేరింది. పరిగి దాటాక సయ్యద్ మల్కాపూర్ గేట్​సమీపంలో కండక్టర్​టికెట్లు కొట్టేందుకు, డ్రైవర్​బస్సును రోడ్డు పక్కన ఆపబోయాడు. 

రోడ్డు పక్కన హెచ్చుతగ్గులు, మట్టి దిబ్బల కారణంగా బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. అప్పటికే కండక్టర్ 90 మందికి టికెట్లు కొట్టారు. బస్సులో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో దాదాపు 30 మందికి గాయాలయ్యాయి. వారిని పరిగి ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో వికారాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.