
వికారాబాద్ జిల్లా: పరిగి శివారులోని మల్కాపూర్ వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బస్సును సైడుకు ఆపే క్రమంలో మట్టి కుంగి బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 90 మంది ప్రయాణికులు ఉన్నారు. ముప్పై మందికి పైగా స్వల్ప గాయాలవ్వగా, ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులందరిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బస్సు పరిగి నుంచి షాద్ నగర్ వెళ్తుండగా ఘటన జరిగింది. బస్సులో ప్రయాణికులు అధికంగా ఉండడంతో టికెట్లు ఇచ్చేందుకు బస్సును సైడుకు ఆపే క్రమంలో ప్రమాదం జరిగినట్లు తెలిసింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపించారు.
ALSO READ | హైదరాబాద్ పబ్లిక్కు అలర్ట్.. మార్చి 18 వరకూ జర జాగ్రత్త..!