
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్టీసీ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కామారెడ్డి నుంచి సిరిసిల్లకు వస్తుండగా గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామ శివారు దగ్గరకు రాగానే టైర్ పగిలింది. దీంతో రోడ్డు పక్కన ఉన్న వరి పొలంలోకి దూసుకెళ్లింది బస్సు. ప్రమాద సమయంలో బస్సులో 30 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సంఘటనతో ఒక్కసారిగా బస్సులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో నుంచి ఒక్కొక్కరుగా బయటకు దిగారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు.. గాయపడిన ప్రయాణికులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.