
బెజ్జంకి, వెలుగు : ఆర్టీసీ బస్సు స్టీరింగ్ విరిగిపోవడంతో పొలాల్లోకి మళ్లించిన సంఘటన సోమవారం మండల కేంద్రంలోని ముత్తన్నపేటలో జరిగింది. డ్రైవర్ సంపత్ చెప్పిన వివరాల ప్రకారం.. కరీంనగర్ వన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 41 మంది ప్రయాణికులతో బెజ్జంకి నుంచి బయలుదేరగా ముత్తన్నపేట కల్వర్టు రాగానే స్టీరింగ్ రాడ్విరిగిపోయింది.
దీంతో ప్రమాదాన్ని నివారించడానికి బస్సును పొలాల్లోకి మళ్లించినట్లు చెప్పాడు. సమయస్ఫూర్తిగా వ్యవహరించిన డ్రైవర్ను ప్రయాణికులు అభినందించారు. ఘటనా స్థలాన్ని డిపో మేనేజర్ సరస్వతి పరిశీలించారు