ప్రయాణికులతో సహా ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన దొంగ

దొంగలు బంగారం, డబ్బులు, పర్సులు, బ్యాగులు, మొబైళ్లు చోరీ చేస్తుంటారు. కానీ ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... సిద్దిపేట బస్ స్టాండ్ లో ఈరోజు(సెస్టెంబర్ 11) ఆర్టీసీ బస్సును చోరీ చేశాడు. ప్రయాణికులందరూ బస్సులో ఉండగానే బస్సును ఎత్తుకెళ్లి.. బస్సు డ్రైవర్, కండక్టర్ కు షాకిచ్చాడు. అయితే బస్సును జిల్లెళ్ల క్రాసింగ్ వద్దకు తీసుకురాగానే రోడ్డుపై నుంచి గుంతలోకి తీసుకెళ్లాడు. 

దీంతో ప్రయాణికులకు అనుమానం వచ్చి.. నువ్వు ఆర్టీసీ డ్రైవర్ వేనా అని నిలదీశారు. అసలు నిజం తెలుసుకున్న ప్రయాణికులు అవాక్కయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.