త్రీ వీలర్ ను తప్పించబోయి డివైడర్ పైకి వెళ్లిన ఆర్టీసీ బస్సు..

ఆత్మకూరు, (దామెర) వెలుగు: హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ, ఓగ్లాపూర్ మధ్య నేషనల్ హై వే మీద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. ఆదివారం ఉదయం  హనుమకొండ  నుంచి భూపాలపల్లి డిపో కు వెళుతున్న బస్సు ప్రమాదానికి గురైంది. 

మేడారం డ్యూటీ చేసిన పోలీసులను హైదరాబాద్​లో  దింపి  బస్సు భూపాలపల్లి డిపో కు వెలుతోంది. బస్సు ముందు త్రీ వీలర్​పై వికలాంగుడు ప్రయానిస్తున్నాడు. బస్సు డ్రైవర్ త్రి వీలర్ ను తప్పించబోయి,  అదుపు తప్పి డివైడర్ పైకి వెళ్ళింది. ఈ ప్రమాదంలో  వికలాంగుడికి స్వల్ప గాయాలు కాగా 108 లో వరంగల్ లోని ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ మేడారం డ్యూటీ చేసి, నిద్ర లేక పోవటం వల్ల  ప్రమాదం జరిగినట్లు ఆర్టీసీ వర్గాలు చర్చించుకుంటున్నారు.