భారీ వర్షాల నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ – విజయవాడ మార్గాల్లో రెగ్యులర్ సర్వీసు బస్సులను రద్దు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయన జులై 28న ట్వీట్‌చేశారు.
ట్వీట్లోని వివరాల ప్రకారం. . హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. ఏపీ లోని కృష్ణా జిల్లా కీసర టోల్గేట్ సమీపంలోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉద్ధృతి నేపథ్యంలో ఆ రహదారిపై రాకపోకలు స్తంభించిపోయాయి.
AsloRead:తెగిన రోడ్లు.. నిలిచిన రాకపోకలు
ఈ నేపథ్యంలో ఆ మార్గాల్లో టీఎస్‌ఆర్టీసీ బస్సులు రద్దు చేసింది. ప్రత్యామ్నయంగా హైదరాబాద్‌నుంచి మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడకు బస్సులు నడపనున్నట్లు సజ్జనార్ తెలిపారు.
ఈ మార్గంలో ప్రతి అరగంటకో బస్సు ఎంజీబీఎస్ బస్‌స్టేషన్ నుంచి బయల్దేరుతుందని వివరించారు. మరింత సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040 - 69440000, 040 - 23450033 లలో సంప్రదించాలన్నారు.