జగిత్యాల జిల్లా ధర్మపురిలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు ఆర్టీసీ బస్సులు భారీగా బయలుదేరాయి. దీంతో మీటింగ్ కు బస్సులు ఎక్కువ మొత్తంలో వెళ్లడంతో.. బస్టాండ్ లో బస్సులు లేక ప్రయాణికులు, స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్యకర్తలు, నాయకులు, అభిమానులను జన సమీకరణ చేసేందుకు ఒక్కో గ్రామానికి, 3నుంచి 4 బస్సులు సభకు బయలుదేరాయి.
Also Read : ఈడీ నోటీసులు చట్టవిరుద్ధం..విచారణకు హాజరుకాలేను : కేజ్రీవాల్
ఈ నేపథ్యంలో బస్టాండ్లలో 2, 3 గంటలు వెయిట్ చేసిన బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న పిల్లలతో గంటల తరబడి బస్సుల కోసం ఎదురుచూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.