రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులను పెంచాలి.. బస్సు భవన్ ముందు సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ధర్నా

రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులను పెంచాలి.. బస్సు భవన్ ముందు సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ధర్నా

ముషీరాబాద్, వెలుగు: ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ నాయకులు డిమాండ్​చేశారు. ఈ మేరకు బుధవారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్​లోని బస్ ​భవన్ వద్ద ధర్నాకు దిగారు. మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.రమా, చిన్న చంద్రన్న, చంద్ర అరుణ, ఎస్.ఎల్.పద్మ, ఆవుల అశోక్, సి.వై.పుల్లయ్య, ఎం.హన్వేశ్ మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని స్వాగతిస్తున్నామని, అయితే 3 వేల బస్సులు తొలగించడం కరెక్ట్​కాదన్నారు. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులను పెంచాలని డిమాండ్ చేశారు.

మహాలక్ష్మి స్కీంతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరిగిందని, చాలాచోట్ల బస్సుల్లో సీట్ల కోసం ఘర్షణ పడుతున్నారని తెలిపారు. ప్రతిగ్రామానికి బస్సు సర్సీస్​ఏర్పాటు చేయాలని, బస్టాండ్లలో టాయిలెట్స్ ను క్లీన్​గా ఉంచాలని కోరారు. నష్టపోతున్న ఆటోల డ్రైవర్లకు ఆర్టీసీలో ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నిరసనలో నాయకులు సూర్యం, స్వరూప, అజయ్, ప్రదీప్, రామకృష్ణ, ఆజాద్, శిరోమణి, ప్రవీణ్, వెంకటేశ్, వరలక్ష్మి, రవికృష్ణ, లక్ష్మీబాయి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.