ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

రిజర్వేషన్ కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తనిఖీ చేసిన ఆర్టీసీ చైర్మన్

నిజామాబాద్ : తిరుపతి ప్రధాన బస్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ రిజర్వేషన్ కౌంటర్లను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్సు టికెట్లతో పాటు వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులకు సంస్థ అందిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట  టీఆర్ఎస్ రైతు విభాగం మాజీ అధ్యక్షుడు ఈగ సంజీవరెడ్డి, మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ డిప్యూటీ ఆర్ఎం రాము ఉన్నారు.

సైబర్ నేరాలపై 100 ఫిర్యాదులు

నిజామాబాద్ : సైబర్ నేరాలపై నిజామాబాద్ సీపీ నాగరాజు బుధవారం నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. జిల్లాలోని నలుమూలల నుంచి 100కు పైగా ఫిర్యాదులు అందాయి. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని ఫిర్యాదుదారులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. గుర్తుతెలియని వ్యక్తులకు తమ వ్యక్తిగత సమాచారం ఇవ్వొద్దని, బ్యాంకు ఖాతా వివరాలు చెప్పవద్దని, ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చే ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లింకులు ఓపెన్ చేయవద్దని సూచించారు.  ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ ద్వారా మోసపోయినట్లు అనిపిస్తే 24 గంటల లోపు టోల్ ఫ్రీ నంబర్ 1932కు ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో డీసీపీ అరవింద్ బాబు, సీసీ ఆర్బీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ డి.ప్రతాప్, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ఎండీ ముఖిద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫారుకీ, అబ్దుల్ రషీద్ పాల్గొన్నారు. అనంతరం ఫంక్షనల్ వర్టికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందికి సీపీ ప్రత్యేక రివార్డులు అందజేశారు. ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెస్టిగేషన్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నాలుగో టౌన్ ఎస్సై సందీప్, స్టేషన్ హౌస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వన్ టౌన్ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో విజయబాబు అవార్డులు అందుకున్నారు.

స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

సిరికొండ : మండలంలోని సత్యశోధక్ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ముగ్గురు స్టూడెంట్లు ప్రదీప్, వర్షిత్, ముజీబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నవాస్ (అండర్-12) స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ఆర్.నర్సయ్య చెప్పారు. గత నెలలో జిల్లా స్థాయిలో జరిగి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వీరు రాష్ట్ర జట్టుకు ఎంపికైనట్లు వెలిపారు. ఈనెల 28 నుంచి 30 వరకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగే పోటీల్లో పాల్గొంటారని వివరించారు. ఎంపికైన స్టూడెంట్లను టీచర్లు అభినందించారు.

చిరుత పుకార్లు నమ్మొద్దు

పిట్లం : మండలంలోని చిన్నకొడప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫారెస్టులో చిరుత పులి అంటూ వైరల్ అయిన వీడియోలను నమ్మ వద్దని  పిట్లం ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్ తెలిపారు. చిరుత వీడియోతో పాటు పిట్లం జూనియర్ కాలేజీ సమీపంలో గొర్రె చనిపోయి ఉన్న ఫొటో వైరల్ కావడంతో ఆయన స్పందించారు. బుధవారం సాయంత్రం ఫారెస్టు ప్రాంతంలో పర్యటించారు. వాట్సప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వీడియో పెట్టిన వారిని పిలిపించి విచారించారు. వారు వీడియోలో ఉన్న స్థలాన్ని చూపించకుండా సంబంధం లేని చోటును చూపించడంతో పాటు పొంతనలేని సమాధానాలు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియో ఈ  ప్రాంతానిది కాదని, కావాలనే కొందరు వైరల్ చేసినట్లు తెలిపారు. ఇక్కడి ప్రాంతంలో చిరుత సంచారం గతంలో ఉందని, అయితే ప్రస్తుత పరిస్థితిలో చిరుతలు బయటకు రావని తెలిపారు. చిరుత వీడియో వైరల్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఆయన వెంట ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీవో సాగర్ ఉన్నారు.

తాను చనిపోయినా.. 8 మందికి జీవితం

నిజామాబాద్ : వెలుగు: కోర్టు ఉద్యోగి సుధారాణి చనిపోయినా ఎనిమిది మందికి జీవితాన్ని ప్రసాదించింది. పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు అందే సాయిలు సతీమణి సుధారాణి నిజామాబాద్ కోర్టులో టైపిస్ట్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌‌‌‌‌‌‌‌తో మంగళవారం మరణించారు. కుటుంబ సభ్యులు ఆమె ఐదు ఆర్గాన్స్ గుండె, కాలేయం, కిడ్నీ ,కండ్లు, తదితర అవయవాలను దానం చేశారు. ఆమె చనిపోయి ఎనిమిది మంది జీవితాల్లో వెలుగులు నింపారు. సుధారాణి అంత్యక్రియలు బుధవారం గంగాస్తాన్‌‌‌‌‌‌‌‌లో 
నిర్వహించారు. 

ఈనెల 29 నుంచి రాష్ట్ర స్థాయి హాకీ టోర్నీ

ఆర్మూర్  :  ఈనెల 29 నుంచి 31 వరకు దివంగత సీనియర్ హాకీ క్రీడాకారుడు కుండ రఘురాం స్మారకార్థం తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ గర్ల్స్ హాకీ పోటీలు నిర్వహిస్తున్నట్లు హాకీ సంఘం ప్రధాన కార్యదర్శి సదమస్తుల రమణ, కోశాధికారి పింజ సురేందర్ తెలిపారు. ఇందు కోసం ఆర్మూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని జావిద్ భాయ్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన జిల్లా జట్టు ట్రైనింగ్ క్యాంపును బుధవారం మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పండిత్ వినీత పవన్ పరిశీలించి క్రీడాకారులతో మాట్లాడారు. రాష్ట్ర స్థాయి టోర్నీలో తమ జిల్లా జట్టు గెలిచే విధంగా మెళకువలు నేర్చుకోవాలని సూచించారు. కౌన్సిలర్ గంగామోహన్​ చక్రు, అడ్వకేట్ వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పీఈటీ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సునీత, గోవింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సొసైటీ చైర్మన్ బంటు మహిపాల్, టోర్నీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అంజు,   చిన్నయ్య, సంతోష్ ఠాకూర్, నగేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్​ ప్రధాన కార్యదర్శి బి.శ్యామ్, పీఈటీలు గంగారెడ్డి, నిఖిత, హనుమాన్ యూత్ మెంబర్లు  రవి, విఠోభా శేఖర్, భాస్కర్ పాల్గొన్నారు.