- చాలా చోట్ల బస్ షెల్టర్లు కరువు
- కూర్చోడానికి కుర్చీలుండవు
- పట్టించుకోని అధికారులు
హైదరాబాద్: అసలే ఎండకాలం.. టైంకు రాని బస్సులు. వచ్చినా.. బస్టాపుల్లో ఆగని పరిస్థితి. కొన్నిచోట్ల వెయిట్ చేసేందుకు బస్టాపులు ఉండవు. ఉన్నా.. కూర్చునేందుకు కుర్చీలుండవు. ఇవి సిటీలో ఆర్టీసీ ప్రయాణికుల అవస్థలు. కొన్ని చోట్ల రోడ్ వైడ్నింగ్ లో బస్ షెలర్టన్లు తొలగించి.. తిరిగి ఏర్పాటు చేయలేదు. కొన్ని రూట్లల్లో జనానికి సరిపడా బస్సులు లేవు. ఇన్ని ఇబ్బందుల మధ్య రోజు ప్రయాణం చేయాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
సిటీలో దాదాపు1000 బస్టాపులున్నాయి. వాటిలో 8వందల స్టాపులను ప్రభుత్వం యాడ్ ఏజేన్సీలకు అప్పగించించింది. మిగతా 200 బస్టాపులు నామ్ కే వాస్తే అన్నట్లుగా ఉన్నాయి. కూకట్ పల్లి, జేఎన్టీయూ, దిల్సుఖ్ నగర్, షేక్ పేట్, ఫిల్మ్ నగర్ , దర్గా రోడ్, యూసుఫ్ గూడ, ఎర్రగడ్డ లాంటి చోట్ల బస్ షెల్టర్లు లేవు. కొన్నిచోట్ల ఫుట్ పాత్ లను ఆక్రమించి షాపులు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో రోడ్లపైనే జనం బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. యాడ్ ఏజెన్సీలకు అప్పగించిన షెల్టర్లు ప్రకటనలకు తప్పితే .. కూర్చోడానికి కూడా ఉపయోగంలేదని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించకపోతే ఎట్లా అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..