- జాబ్ నుంచి తీసేసినందుకేనని కార్మికుల ఆరోపణ
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఆర్టీసీ డిపోలో కలకలం రేపింది. సైదులు కృష్ణ(42) కొత్తగూడెం ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్నారు. ఆయన సొంతూరైన వైరా మం డలం నారపనేనిపల్లిలో బుధవారం ఉరివేసు కుని చనిపోయాడు. డ్యూటీకి సక్రమంగా రావడం లేదని.. వారం రోజుల కింద ఆయన్ను అధికారులు జాబ్ నుంచి తీసేశారు. మనస్తాపానికి గురైన కృష్ణ.. ఆత్మహత్యకు పాల్పడ్డాడని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు. డీఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. కృష్ణ మద్యానికి బానిస అవడంతో పాటు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడని తెలిపారు. డ్యూటీకి రాకపోవడంతో తీసేశామన్నారు.