
జైపూర్, వెలుగు: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతికితో పాటు, పలువురు గాయపడడానికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్‌కు రెండేండ్ల జైలు శిక్ష విధిస్తూ చెన్నూర్ జూనియర్ కోర్టు జడ్జి రవి శుక్రవారం తీర్పునిచ్చినట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు. మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసి డ్రైవర్ జాడి ప్రేమ్‌కుమార్2019లో జైపూర్ మండలంలోని రసూల్‌పల్లి నుంచి అతివేగంగా బస్సు నడుపుతూ రాంగ్ రూట్లో వచ్చి పవర్ ప్లాంట్ సమీపంలో ఉన్న కల్వర్టుని ఢీకొట్టాడు.
దీంతో బస్సులో ప్రయాణిస్తున్న భీమారం మండల కేంద్రా నికి చెందిన దుగుట లక్మి చనిపోయింది. 26 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై నాటి జైపూర్ ఎస్సై విజేందర్ కేసు నమోదు చేశారు. శుక్రవారం పబ్లిక్ ప్రాసిక్యూటర్ నంది రవీందర్, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ రాజశేఖర్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా నేరం రుజువు కావడంతో జడ్జి తీర్పునిచ్చినట్లు ఎస్సై తెలిపారు.