హనుమకొండ జిల్లాలో చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు

హనుమకొండ జిల్లాలో చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు
  • ఏడుగురికి గాయాలు

హసన్ పర్తి, వెలుగు: ఆర్టీసీ ఎలక్ట్రిక్​ బస్సు చెట్టును ఢీకొనడంతో ఆరుగురు గాయపడ్డారు. ప్రమాదంలో బస్సు ముందు భాగంగా నుజ్జునుజ్జు అయ్యింది. వరంగల్ డిపో 2కు చెందిన ఆర్టీసీ బస్సు శుక్రవారం రాత్రి వేములవాడ నుంచి హనుమకొండకు బయలుదేరింది. అర్ధరాత్రి దాటిన హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం అనంతసాగర్ సమీపంలో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్​తోపాటు ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. 

క్షతగాత్రులను ఎల్కతుర్తి, హసన్‌‌పర్తి పోలీసులు 108 వాహనంలో వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన 10 అడుగుల దూరంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఉంది. ఒక వేళ ట్రాన్స్‌‌ ఫార్మర్ ను ఎలక్ట్రికల్ బస్సు ఢీకొని ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని స్థానికులు చెప్తున్నారు.