ఫిట్​మెంట్ ప్రకటనపై ఆర్టీసీ ఉద్యోగుల సంబరాలు

ఆసిఫాబాద్/కాగజ్ నగర్, వెలుగు: ఆర్టీసీ ఉద్యోగులకు 21శాతం ఫిట్​మెంట్ ఇస్తూ కాంగ్రెస్​ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ఆర్టీసీ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ ఆసిఫాబాద్​నియోజకవర్గ ఇన్ చార్జ్ అజ్మీర శ్యాంనాయక్ ఆధ్వర్యంలో​జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫొటోలకు ఆర్టీసీ కార్మికులు క్షీరాభిషేకం చేశారు. గత పాలకులు ఆర్టీసీని పట్టించుకోలేదని, 40 మంది కార్మికుల చావుకు బీఆర్ఎస్​ కారణమైందని మండిపడ్డారు. కాగజ్ నగర్ పట్టణంలో బస్టాండ్ ఆవరణలో ఆర్టీసీ ఉద్యోగులు, కాంగ్రెస నేతలు రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు.