బ్రీత్ ఎనలైజర్ యంత్రాలు రిపేర్ చేయాలి

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఆర్టీసీ డిపో ముందు డ్రైవర్లు, డిపో కార్మికులు ధర్నాకు దిగారు. బ్రీత్ ఎనలైజర్ యంత్రాలు మద్యం తాగకపోయినా తాగినట్లు చూపిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. బ్రీత్ ఎనలైజర్ యంత్రాలు రిపేర్ చేపించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అధికారుల నిర్లక్ష్యంతో గతంలో ముగ్గురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడిందన్నారు. కొత్త బ్రీత్ ఎనలైజర్లను ఉపయోగించాలని వారు కోరారు. అంతేకాకుండా సస్పెండ్ అయిన సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.