బస్టాండ్​ను సందర్శించిన ఆర్టీసీ అధికారులు

బస్టాండ్​ను సందర్శించిన ఆర్టీసీ అధికారులు

భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ బస్టాండ్ ను బుధవారం ఆర్టీసీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాలోమాన్ సందర్శించారు. ఆర్టీసీ బస్టాండ్ ఆనుకొని ఉన్న దుకాణాల సముదాయాన్ని పరిశీలించారు. హైవే వెడల్పు వల్ల సెంటర్​లోని అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపాన్ని ఎటువంటి ఆదేశాలు లేకుండానే ముల్కనూర్ బస్టాండ్ లోకి తరలించే ప్రయత్నం చేస్తున్నారన్న సమాచారంతో 20 రోజులుగా ఆర్టీసీ సిబ్బంది షాపింగ్ కాంప్లెక్స్ వెనుక ఉన్న స్థలంలో ఆర్టీసీ బస్సును నిలిపి సెక్యూరిటీ సిబ్బందితో పహారా కాస్తున్నారు. 

విషయం తెలుసుకున్న రాష్ట్ర అధికారులు ముల్కనూర్ బస్టాండ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ టెండర్ల ద్వారా 18 షాపుల ఏర్పాటు ప్రక్రియ సత్వరమే పూర్తి చేయాలన్నారు. ప్రయాణికుల రద్దీపై ఆరా తీసి సరిపడా సౌకర్యాలు కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కరీంనగర్ రీజినల్ మేనేజర్ రాజు, డిప్యూటీ రీజినల్ మేనేజర్ భూపతిరెడ్డి, హుజూరాబాద్ డీఎం రవీందర్ నాథ్ తదితరులు పాల్గొన్నారు.