మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ లక్కీ డ్రా

సుల్తానాబాద్, వెలుగు: రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని  ఈనెల 30, 31 తేదీల్లో ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే మహిళలకు నగదు బహుమతులు ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.5 లక్షల50 వేల విలువైన బహుమతులకు గాను లక్కీ డ్రా నిర్వహిస్తోంది.  

సుల్తానాబాద్ లోని బస్టాండ్ లో  లక్కీ డ్రా బాక్స్ ను బుధవారం ప్రారంభించారు.  మహిళలు తమ టికెట్  వెనుక పేరు, చిరునామా, ఫోన్ నంబర్  రాసి బాక్సులలో వేశారు.  కార్యక్రమంలో కరీంనగర్ ఆర్టీసీ 2వ డిపో మేనేజర్ మల్లయ్య,  కంట్రోలర్  రావు, ఖాదర్, సంపత్, దూడం ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.