- ఇతర బస్సుల్లో యథాతథం
హైదరాబాద్, వెలుగు: దసరా పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సుల్లోనే అదనంగా 25 శాతం చార్జీని ప్రయాణికుల నుంచి వసూలు చేయనున్నామని ఆర్టీసీ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. సాధారణ బస్సుల్లో ఎటువంటి చార్జీలను పెంచలేదని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
పండుగల సందర్భంగా ఏర్పాటు చేసే స్పెషల్ బస్సుల్లో 25 శాతం చార్జీలను అధికంగా వసూలు చేయడం సాధారణమేనని చెప్పారు. అదనపు చార్జీలను వసూలు చేయడానికి ప్రభుత్వ అనుమతి ఉందని అందులో పేర్కొన్నారు. కేవలం స్పెషల్ బస్సులు అని బోర్డు ఉన్న బస్సుల్లో మాత్రమే 25 శాతం అదనపు చార్జీలు వసూలు చేయనున్నట్టు వెల్లడించారు.