
అచ్చంపేట, వెలుగు: వేతనాలు పెంచాలని ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ఆందోళనకు దిగారు. అచ్చంపేట డిపో ప్రైవేట్ బస్సులను నిలిపివేసి గురువారం బస్టాండ్ ముందు ఆందోళన చేశారు. ఆర్టీసీ యాజమాన్యం ఓనర్లపై ఒత్తిడి తెచ్చి డ్రైవర్ల జీతాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో సీఐటీయూ నేతలు రాములు, శివకుమార్ ,సైదులు డ్రైవర్లు పాల్గొన్నారు.