ఏపీలో ఘోర ప్రమాదం.. ఐదుగురు కూలీలు మృతి

ఆంధ్రప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీస్ బస్సు, కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటన కోనసీమ జిల్లాలోని పి గన్నవరం మండలంలోని ఊడిమూడి సమీపంలో మే 14వ తేదీ మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. రాజోలు నుండి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి.. వరి ధాన్యం లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొన్నట్లు సమాచారం. 

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడని ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు.  క్షతగాత్రులను స్థానికులు వెంటనే  చికిత్స కోసం ఆంబులెన్స్ లో అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.  ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన వారిలో ముగ్గరు జి.పెద్దపూడి, మరో ఇద్దరు ఆదిమూలవారిపాలెం వాసులుగా గుర్తించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.