ఆర్టీసీకి రూ.35 లక్షల ఆదాయం

నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ, యాదగిరిగుట్ట, నార్కట్​పల్లి డిపోల పరిధిలోని సుమారు 200 బస్సులను టీఆర్ఎస్​మీటింగ్​కు తరలించడంతో ఆర్టీసీకి రూ.35 లక్షల ఆదాయం సమకూరింది. బస్సుకు 50 మంది చొప్పున 200 బస్సుల్లో వెయ్యి మందిని మునుగోడు నియోజకవర్గం నుంచి ఆత్మీయ సమ్మేళనానికి  తరలించారు. కాగా, పార్టీ లీడర్ల పేరిట బస్సులు బుక్ చేస్తే ఎన్నికల కోడ్ పరిధిలోకి వస్తదని భావించి, కుల సంఘాల పేరిట, ఇతరుల పేర్లతో బస్సులు బుక్​ చేశారు.

ఇటీవల చౌటప్పుల్ ఓటర్లను ఎమ్మెల్యే జీవన్​రెడ్డి యాదగిరిగుట్ట టూర్​కు తీసుకెళ్లడం వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. దీన్ని సీరియస్​గా తీసుకున్న ఎన్నికల కమిషన్ చౌటుప్పల్​తహసీల్దార్​ను సస్పెండ్ చేసింది. ఇది జరిగిన రెండు, మూడు రోజులుకే మళ్లీ గౌడ కులస్తులను మన్నెగూడకు తరలించడం కూడా ఎన్నికల కోడ్ పరిధిలోకి వస్తుందని ప్రతిపక్ష పార్టీల లీడర్లు ఆరోపిస్తున్నారు.