కరీంనగర్ లో ‘మహాలక్ష్మి’ ఇన్ కం రూ.230 కోట్లు

కరీంనగర్  లో ‘మహాలక్ష్మి’ ఇన్ కం రూ.230 కోట్లు
  • కరీంనగర్ రీజియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏడున్నర నెలల్లో 6.35 కోట్ల జీరో టికెట్లు జారీ
  • స్కీమ్ ను వినియోగించుకుంటున్న లక్షలాది మంది మహిళలు
  • ఆర్టీసీ బస్సుల్లో పెరిగిన ఆక్యుపెన్సీ.. 
  • ఇతర మార్గాల్లో మరో రూ.232 కోట్లు రాక
  • ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పల్లెవెలుగు బస్సుల్లో రోజూ 4.15లక్షల మంది మహిళల ప్రయాణం 

కరీంనగర్, వెలుగు: మహాలక్ష్మి స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆర్టీసీకి ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తోంది. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రవేశపెట్టిన ఈ పథకం అమల్లోకి వచ్చిన ఏడున్నర నెలల్లో కరీంనగర్ రీజియన్ కు రూ.230 కోట్లు ఆదాయం సమకూరింది. రీజియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రోజుకు సగటున 4.15 లక్షల మంది మహిళలు ఎక్స్ ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో రాకపోకలు సాగిస్తుండగా.. వారికి ఈ ఏడున్నర నెలల్లో 6.35 కోట్ల జీరో టికెట్లను ఆర్టీసీ జారీ చేసింది. మహిళలకు ఉచిత ప్రయాణం స్కీమ్ అమలు కాక ముందు బస్సుల్లో కేవలం 68 శాతం మాత్రమే ఉన్న ఆక్యుపెన్సీ.. ఇప్పుడు 85 శాతం దాటింది.  స్కీమ్ ప్రారంభంలో సంస్థలో బస్సుల కొరత, జాతరల సమయం కావడంతో మహిళా ప్రయాణికులతో బస్సులు కిక్కిరిసిపోయేవి. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. కొత్త బస్సుల సంఖ్య పెరగడంతో గతంతో పోలిస్తే రద్దీ తగ్గింది. కేవలం వీకెండ్స్ (శనివారం), హాలీడేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పండుగ సమయాల్లోనే బస్సుల్లో రద్దీ కనిపిస్తోంది. మిగతా రోజుల్లో సాధారణ పరిస్థితే ఉంటోంది. 

ప్రయాణికులు డబుల్

కరీంనగర్ ఆర్టీసీ రీజియన్ లో కరీంనగర్1, 2, హుస్నాబాద్, హుజూరాబాద్, మంథని, గోదావరిఖని, మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, జగిత్యాల, కోరుట్ల, వేములవాడ, సిరిసిల్ల.. మొత్తంగా 11 డిపోలు ఉన్నాయి. మహాలక్ష్మి స్కీమ్ అమలుకు ముందు కరీంనగర్ రీజియన్ లో ప్రతిరోజు 2.21 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగించేవారు. స్కీమ్ అమల్లోకి వచ్చాక ప్రతిరోజూ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పల్లెవెలుగు బస్సుల్లో 4.15 లక్షలకు మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది.

పెరిగిన రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు బస్సులు నడుపుతుండడంతో ఆదాయం పెరుగుతోంది. అన్ని బస్సుల్లో సీట్లకు మించి ఎక్కడంతో నిల్చొని ప్రయాణిస్తున్నారు. మరోవైపు ఈ బస్సుల్లో రద్దీతో చాలామంది డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ, లహరి బస్సుల్లో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈ బస్సుల్లో కూడా ఆక్యుపెన్సీ పెరిగింది. కేవలం జీరో టికెట్ల ద్వారా ఏడున్నర నెలల్లో కరీంనగర్ రీజియన్ కు రూ.230.72 కోట్ల ఆదాయం రాగా.. పురుషుల టికెట్లు, కార్గో, ఇతర సేవల ద్వారా మరో రూ. 232 కోట్ల ఆదాయం సమకూరింది. 

రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతున్నాం

మహాలక్ష్మి స్కీమ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మహిళా ప్రయాణికులకు 6.35 కోట్లు జీరో టికెట్లు జారీ చేయగా, రూ.230.72 కోట్ల ఆదాయం వచ్చింది. ఆక్యుపెన్సీ రేషియో  85.33కు పెరిగింది. రద్దీకి అనుగుణంగా పక్కా ప్రణాళికతో బస్సులను నడుపుతున్నం. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా సమన్వయంతో పనిచేస్తున్నాం.- ఎన్. సుచరిత, ఆర్ఎం, ఆర్టీసీ కరీంనగర్ రీజియన్