- మహిళ ప్రాణాలు కాపాడిన డ్రైవర్‌కు సజ్జనార్ అభినందనలు
హైదరాబాద్, వెలుగు : సమయస్పూర్తితో ఓ మహిళ ప్రాణాలు కాపాడిన మెట్‌పల్లి డిపో డ్రైవర్ పి.రాములును ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభినందించారు. డ్రైవర్ చాకచాక్యం, అప్రమత్తత వల్ల ఓ నిండు ప్రాణం నిలిచిందని శుక్రవారం ట్వీట్ చేశారు.
గురువారం మెట్‌పల్లిలో జగిత్యాల వైపు వెళ్తున్న బస్ కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు ఓ మహిళ యత్నించగా, బస్ డ్రైవర్ రాములు గుర్తించి అప్రమత్తమయ్యారు. వెంటనే బస్సును ఆపడంతో ఆ మహిళకు ప్రాణాప్రాయం తప్పిందని ఎండీ తెలిపారు. ఈ వీడియోను ఎండీ ట్విటర్లో పోస్టు చేశారు.