ట్రాన్స్ జెండర్లకు సురక్షితమైన వాతావరణం మా బాధ్యత : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడి 

ట్రాన్స్ జెండర్లకు సురక్షితమైన వాతావరణం మా బాధ్యత : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: ప్రజా రవాణాలో ట్రాన్స్ జెండర్లకు సురక్షిత మైన, గౌరవప్రదమైన వాతావరణం కల్పించడం ఆర్టీసీ బాధ్యత అని ఆ సంస్థ ఎండీ సజ్జనార్ అన్నారు. ట్రాన్స్ విజిబిలిటీ డే సందర్భంగా వారికి మద్దతుగా కొన్ని స్వచ్చంద సంస్థలతో కలిసి ఆర్టీసీ అధికారులు గురువారం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ట్రాన్స్ జెండర్ల కు జనంలో తగిన గౌరవం ఉండేలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్సు స్టేషన్లు, డిపోలలో పోస్టర్లను ప్రద ర్శించనున్నట్టు ఆయన చెప్పారు. ట్రాన్స్ జెండర్ల హక్కులపై జనాల్లో పూర్తి అవగాహన కలిగించేందుకు ఈ పోస్టర్ల ప్రదర్శన ఉపయోగపడు తుందని సజ్జనార్ పేర్కొన్నారు.