మీ పిల్లలకు రోడ్డు యాక్సిడెంట్.. కొత్త రకం సైబర్ మోసం ఇదిగో వీడియో

మీ పిల్లలకు రోడ్డు యాక్సిడెంట్.. కొత్త రకం సైబర్ మోసం ఇదిగో వీడియో

ఈ మధ్య సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.డిజిటల్ అరెస్టులు..గిఫ్ట్ లు ,ఆఫర్లు,జాబ్ ఆఫర్లు అంటూ ఫోన్లకు లింక్ లు పంపి  ఇలా రకరకాలగా సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. దొరికిన కాడికి దోచుకుంటున్నారు.   పెరుగుతున్న టెక్నాలజీతో కొత్త కొత్త  పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ఎక్స్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో ఎలా మోసం చేస్తారో తెలిపే ఓ వీడియోను పోస్టు చేశారు.  కొత్త తరహా సైబర్ మోసం.. జాగ్రత్త అంటూ హెచ్చరించారు.

 మీ పిల్లలు రోడ్డు యాక్సిడెంట్ కు గురయ్యారని తల్లిదండ్రులకు  సైబర్ నేరగాళ్ల ఫోన్ కాల్స్ చేస్తారు.  హాస్పిటల్ లో ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారని, తక్షణమే సర్జరీ చేయాలంటూ మాయమాటలు చెబుతారు.  సర్జరీ కోసం వెంటనే డబ్బులు పంపాలంటూ లింకులను షేర్ చేస్తున్నారు కేటుగాళ్ళు.  ఆ లింకులను క్లిక్ చేయగానే బ్యాంక్ ఖాతాల నుంచి నగదును గుల్ల చేస్తున్నారు.   ఇలాంటి మోసపూరిత ఫోన్ కాల్స్ కి అసలే స్పందించొద్దు. సైబర్ మోసాలపై కేంద్ర హోంశాఖ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. అని సజ్జనార్ తన ఎక్స్ లో ట్వీట్ చేశారు.
..

కొత్త తరహా సైబర్ మోసం.. జాగ్రత్త!!

➡️ మీ పిల్లలు రోడ్డు యాక్సిడెంట్ కు గురయ్యారని తల్లిదండ్రులకు సైబర్ నేరగాళ్ల ఫోన్ కాల్స్

➡️ హాస్పిటల్ లో ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారని, తక్షణమే సర్జరీ చేయాలంటూ మాయమాటలు

➡️ సర్జరీ కోసం వెంటనే డబ్బులు పంపాలంటూ లింకులను షేర్ చేస్తున్న కేటుగాళ్ళు… pic.twitter.com/9pAVcAsXmv

— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 25, 2024